1)సంబంధాలలో స్పష్టత మీ అభివృద్ధికి బాసట.
2)వివాహ సంబంధాల లభించడం ఒకెత్తయితే వాటిలోనుంచి మంచి సంబంధాలు ఎన్నుకోవడం మరొక ఎత్తు.
3)కంటికి కనిపించేవన్నీ వాస్తవాలు కాని రోజులివి చెవులకు వినిపించే అన్ని నిజాలే ఉండాలని లేదు.
4)అసలు ఏ సంబంధం గురించి అయినా ఎంక్వైరీ చేయడం అవసరమా కాదా అన్నది ఎవరికి వారు ముందుగా నిర్ణయించుకోవాలి.
5)ఎంత తెలిసిన వాళ్ళు అయిన సదరు అబ్బాయి/అమ్మాయి వ్యక్తిగత కుటుంబ విశేషాల గురించి మనకు తెలియాల్సి ఉండాలని లేదు కదా!
6)వివాహ సంబంధాలు విచారణ ఏ మేరకు జరగాలన్నది కూడా ముఖ్యమే.
7)తమలో తాము ఎవరికీ తెలియకుండా ఎంక్వైరీ చేసుకుంటే. సరిపోతుందా?లేక పెద్ద ఎత్తున చేయించాలా అన్నది కూడా ప్రాథమిక దశలోనే నిర్ణయించుకోవాలి.
8)మొత్తానికి విచారణ అన్నది తప్పనిసరి.
9)వ్యక్తి రూపురేఖలు అందచందాలను బట్టి అతని ఆమె వ్యక్తిత్వాన్ని గుణగణాలను కొంతమేరకు అంచనా వేయగలం.
10)కొందరు తమ వ్యక్తిత్వాన్ని గుణాల్ని బయటపడేలా ప్రవర్తిస్తారు!!
11)మరి కొందరు గోప్యంగా మసలు కుంటారు ఈ రకం వారిగురించే బాగా ఆలోచించాలి.
12)"ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్" ఆంగ్ల సామెత గుర్తుకు తెచ్చుకోండి.
13)మనసు తెలుసుకోవడానికి మార్గాలు లేకపోలేదు, వధూవరుల మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఫలితం తప్పకుండా ఉంటుంది.
14)మనసు తెలుసుకోవడానికి ఒక ముఖమే కాదు,కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి.
15)అభివృద్ధి చెందిన వ్యక్తిత్వ మానసిక శాస్త్రాలు మనకు అనేక రహస్యాలను వెలుగులోకి తెచ్చాయి.
16)మీ అబ్బాయి/అమ్మాయికి కాబోయే జీవిత భాగస్వామిని అంచనా వేయండి.
17)మనం మాట్లాడే మాటలు నడిచే నడక రాసే రాతలు చూసే చూపులు, చేసే పనులు వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని వెల్లడిస్తాయి, మనసుంటే ఏదో ఒక మార్గం ఉంటుంది.
18)మీ అబ్బాయికి/అమ్మాయికి సదరు సంబంధం తగినదేనా కాదా, అన్నది మీ విచారణకు ముందే ఆలోచించండి.
19)సంబంధం గురించి ఎంక్వైరీ చేశాక,మ్యాచ్ మీకు గాని చేసుకోబోయే వ్యక్తి గాని నచ్చలేదంటే అది ఎదుటివారిని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది.
20)సంబంధం నచ్చింది అన్న నిర్ణయానికి ప్రకటించడానికి ముందే అన్ని విధాలుగా విచారణ చేసుకోవడం అవసరం.
21)మీఅమ్మాయి/అబ్బాయి అయినా విచారణ లేకుండా పెళ్లి నిర్ణయించుకోవడం మంచిది కాదు.
22)విచారణ ఏ స్థాయిలోనైనా తప్పనిసరిగా జరిగి తీరాలి.
23)ఎదుటివాళ్లు కూడా మీసంబంధం పట్ల శ్రద్ధశక్తులు కనపరుస్తూన్నారా లేదా అన్నది కూడా ముఖ్యo.
24)ఇష్టం లేని వారిని ఎంత కష్టపడి ఒప్పించిన ముందు ముందు వారి చేత సంతోషంగా కాపురం చేయించ లేము కదా!.
25)సంబంధం గురించి విచారణ గోప్యంగా ఉంచడం తప్పనిసరి.
26)విచారణ పెళ్లి కోసమే జరుగుతుందన్న విషయం కూడా ఒక్కసారి బయట పడకూడదు.
27)అవసరం అనిపిస్తే ఈ విషయాన్ని మధ్యవర్తుల కు చెబితే వారికి తెలిసిన నిజాన్ని మనకు తప్పకుండా అందిస్తారు.
28)వధూవరుల తల్లిదండ్రుల మనస్సులను చదివే ప్రయత్నం చేయండి?
29)మీ అబ్బాయి లేదా అమ్మాయి భావి కాపురానికి వారి సహకారం కూడా అవసరమే అందువలన అంతా మమత మంచి వారై ఉండాలి.
30)అమ్మాయి వారికైనా అబ్బాయి వారికైనా సంబంధం కుదుర్చుకునే విషయంలో తొందరపాటు పనికిరాదు.
31)ఆగమేఘాలమీద కుదుర్చుకొని ఆ వెనుక తప్పుకొని మరొకటి వెతుక్కో వచ్చు అనుకోవడం ఇదేమి ఉద్యోగం కాదు.
32)పెళ్లి గురించి అలా అని మరీ జాడ్యం పనికిరాదు సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.
33)మంచి సంబంధం మనం కోరుకోవడానికి ముందు మన సంబంధం మంచిదై ఉండాలి.
34)అంద చందాల విషయంలో భార్యాభర్తలు కావాలి అనుకునే వాళ్ళు తమ అందచందాలు గురించి కూడా ఆలోచించడం మంచిది.
35)నల్లవారికి తెల్లనిమ్మాయి తెల్లవారికి నల్లనిమ్మాయి పనికిరాదని కాదు ఈడుజోడు చిలకాగోరింకల్లా పరస్పరం కలిసి పోయే వాళ్ళు అయితే మంచిది.
36)అలా అని రంగు అందమే కొలబద్ద అనుకోవడం మంచిది కాదు.
37)మన అందచందాలకు తగ్గట్టు కోరుకోవడమే ధర్మం కదా!
38)సాధారణంగా ప్రతి అబ్బాయి నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్న తన అందచందాలతో, సంబంధం లేకుండా మంచి సౌందర్యవతి అయిన అమ్మాయిని భార్యగా కోరుకుంటారు. ఇలాంటి వారు ఒక్కసారి అమ్మాయి తరఫున ఆలోచించాలి.అందానికి తులతూగే పాజిటివ్ పాయింట్స మీ వైపు ఇంకేమైనా ఉన్నాయా ఉదాహరణకు
1 మంచి ఉద్యోగం
2 మంచి వ్యక్తిత్వం
3 ఆదర్శవంతమైన భావాలు గల వ్యక్తి
4 ఉత్తమ వ్యక్తిత్వం
39)వధూవరులు పెరిగిన వాతావరణాన్ని అంచనా వేయండి వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గుణగణాలను బట్టి, వారి గుణగణాలు అంచనా వేయండి!
40)రాబోయే అత్తింటివారు చేసుకోబోయే భాగస్వామి పట్ల తప్పనిసరిగా రాజీ అవసరం.
41)మగపెళ్లి వారుమన్న దర్పముతో ఆడపెళ్లి వారిని చులకనగా చూడటం మంచిది కాదు, మగపెళ్లి వారైనా ఆడపెళ్ళి వారైనా గౌరవ మర్యాదలు సమానంగా ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. 42)కాబోయే అమ్మాయికి/అబ్బాయికి సొంత వ్యక్తిత్వం అలవడిందా!లేదా అన్నది కూడా ముఖ్యమే,వారి నిర్ణయాలు సవ్యంగా ఉన్నాయా లేదా అని గ్రహించాలి.
43)వధూవరుల స్నేహితుల సన్నిహితుల గురించి ఆరాతీయండి.వారి సావాసం ఎంతటివారినైనా సమూలంగా మార్చేయవచ్చు?. 44)వధూవరులపెరుగుతున్న తిరిగిన గృహ వాతావరణాన్ని పరిశీలించండి!
45)అలాగే వధూవరుల పనిచేసే కార్యాలయంలో గానీ నిర్వహించే వృత్తిలో గాని ఎటువంటి సన్నిహిత సంబంధాలున్నాయి స్నేహితులు ఉన్నారో ఆరా తీయండి. 46)మనసులో అనుమానం పెట్టుకోకుండా నిర్మలమైన మనసుతో పెళ్లి సంబంధం గురించి విచారణ పూర్తి చేయండి! అనుమానాస్పదమైన మనస్తత్వంతో పెళ్లి చేసుకోకూడదు.
47)అపనమ్మకంతో ఆరా తీయకండి, పచ్చ కళ్ళు కలిగించుకోవడం మంచిది కాదు, అర్థం చేసుకోవడం అంత తేలిక కూడా కాదు.
48)ఏ సంబంధం అయినా కుదిరినా కుదరకపోయినా ఒకే రకంగా స్పందించండి. ఎదుటి వారి పట్ల మీ ట్రీట్మెంట్ లో తేడాలు చూడటం ఉత్తమ వ్యక్తిత్వం అనిపించుకోదు.
49)బంధువులు మిత్రులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంబంధాలు ఎంక్వైరీ చేస్తే తప్పులతడకలగా మారి ఇప్పుడు తప్పులు డైవర్స్ గా మారే అవకాశం ఉన్నది జాగ్రత్తగా పరిశీలించండి!?
50)వివాహ సంబంధాల గురించి విచారణ చేసుకోవడం తప్పు కాదు.అలా అనేవారుగురించి జాగ్రత్త వహించండి.
51)పెళ్లయిన తర్వాత అయ్యో విచారణ చేయలేదు,అందువలన వధూవరులు మంచివారు కాదు అనుకోవడం మంచిది కాదు,అందువలన వివాహానికి ముందే తప్పనిసరిగా విచారణ అవసరం నేటి సమాజంలో
ఇట్లు
కె. వి.రమణ
స్వీట్ హోమ్ మ్యారేజ్ కన్సల్టెన్సీ
డాబా గార్డెన్స్
విశాఖపట్నం 9849072372